icon icon icon
icon icon icon

కార్పొరేటర్లను కాంగ్రెస్‌లోకి నేనే వెళ్లమన్నా: మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

మేడ్చల్‌ నియోజకవర్గ పరిధిలోని వివిధ మున్సిపల్‌ కార్పొరేషన్లకు సంబంధించి దాదాపు 30 మంది కార్పొరేటర్లను కాంగ్రెస్‌లోకి వెళ్లమన్నది తానేనని మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన ప్రకటన చేశారు.

Updated : 07 May 2024 09:13 IST

కార్ఖానా, న్యూస్‌టుడే: మేడ్చల్‌ నియోజకవర్గ పరిధిలోని వివిధ మున్సిపల్‌ కార్పొరేషన్లకు సంబంధించి దాదాపు 30 మంది కార్పొరేటర్లను కాంగ్రెస్‌లోకి వెళ్లమన్నది తానేనని మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన ప్రకటన చేశారు. న్యూబోయిన్‌పల్లి సౌజన్యకాలనీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ అక్కడ జరుగుతున్న పరిణామాలను తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కార్పొరేటర్లకు సూచించినట్లు చెప్పారు. తాము కాంగ్రెస్‌లో ఉండలేకపోతున్నామని, అక్కడి సీనియర్‌ నాయకుల వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు వారు రోజూ తనకు ఫోన్లు చేస్తున్నారని మల్లారెడ్డి తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకు కాంగ్రెస్‌లోనే ఉంటూ.. భారాస విజయానికి పనిచేయాలని తాను ఆయా కార్పొరేటర్లకు సూచించినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img