icon icon icon
icon icon icon

మోదీపై కాంగ్రెస్‌ ఫిర్యాదు

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ పార్టీ మరోసారి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

Published : 08 May 2024 04:35 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ పార్టీ మరోసారి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని కర్‌గోనెలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పిల్లలు మోదీ ఫొటో పట్టుకుని పాల్గొన్నారని, ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు జి.నిరంజన్‌ మంగళవారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

సేవాదళ్‌ వ్యవస్థాపకునికి నివాళి

అఖిల భారత కాంగ్రెస్‌ సేవాదళ్‌ వ్యవస్థాపకులు పద్మభూషణ్‌ డాక్టర్‌ నారాయణ సుబ్బారావు హర్దికర్‌ 135వ జయంతిని మంగళవారం గాంధీభవన్‌లో నిర్వహించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దేల జితేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img