icon icon icon
icon icon icon

మోదీ మా కలను సాకారం చేయబోతున్నారు

ఎస్సీ వర్గీకరణ కోసం 1994 నుంచి పోరాటం చేస్తుంటే 30 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాదిగలకు న్యాయం చేయనున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.

Published : 09 May 2024 02:52 IST

మంద కృష్ణ మాదిగ 

ఈనాడు, వరంగల్‌: ఎస్సీ వర్గీకరణ కోసం 1994 నుంచి పోరాటం చేస్తుంటే 30 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాదిగలకు న్యాయం చేయనున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. బుధవారం వరంగల్‌ జిల్లా ఖిలావరంగల్‌ మండలం లక్ష్మీపురంలో భాజపా నిర్వహించిన ‘ఓరుగల్లు జనసభ’లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌తోపాటు అన్ని పార్టీలు మాదిగలను ఓట్ల కోసం వాడుకున్నాయని ఆరోపించారు. మూడు దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ కలను మోదీ సాకారం చేయనున్నారని, త్వరలో వర్గీకరణ జరగనుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని వేదికపైకి రాగానే మందకృష్ణ మాదిగను ఆలింగనం చేసుకొని ఆప్యాయంగా పలకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img