icon icon icon
icon icon icon

మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?

డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్‌ప్రదేశ్‌లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు.

Published : 17 May 2024 03:51 IST

డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్‌ప్రదేశ్‌లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. ఆ రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది. భదోహీ కార్పెట్‌ పరిశ్రమను మీ సర్కారు ఎందుకు విధ్వంసం చేస్తోంది. పంటలను నాశనం చేస్తోన్న వీధి పశువుల బెడద నుంచి రైతులకు ఎలా రక్షణ కల్పిస్తారు? విలువైన పంటలను కాపాడుకోవటానికి వ్యవసాయదారులు ఎంతో శ్రమించాల్సి వస్తోంది. నిర్హేతుకమైన జీఎస్టీ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, హస్తకళా ఉత్పాదనలపై పెను భారం మోపుతూ వాటిని దెబ్బతీస్తుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఈ సమస్యలకు మీ వద్ద ఉన్న పరిష్కారం ఏమిటి? యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ కూడా మీ మాదిరిగానే ఏడాదికి రెండు కోట్ల కొత్త ఉద్యోగాలు  కల్పిస్తామన్నారు. గత పదేళ్లుగా ఈ వాగ్దానాన్ని ఎందుకు నెరవేర్చలేకపోయారో ఎన్నికల సభల్లో చెప్పండి. ప్రజలను పక్కదారి పట్టించే ఉపన్యాసాలు ఇవ్వడం ఆపండి.

 జైరాం రమేశ్‌, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి


ముస్లింలకు 15% బడ్జెట్‌ పూర్తి అబద్ధం

మునుపటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో 15 శాతాన్ని ముస్లింలకు కేటాయించదలచుకుందని ప్రధాని మోదీ చేస్తున్న ప్రచారం శుద్ధ అబద్ధం. హిందువులకు, ముస్లింలకు వేర్వేరు బడ్జెట్లు ఉంటాయనడం మరీ దారుణం. అసలు అది ఎలా సాధ్యం? లేదులేదంటూనే హిందూ-ముస్లిం విభజనకు ఆయన ప్రయత్నిస్తున్నారు.

 కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img