icon icon icon
icon icon icon

తదుపరి ప్రధాని అమిత్‌ షానే

దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్‌సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పునరుద్ఘాటించారు.

Updated : 17 May 2024 06:01 IST

రిజర్వేషన్ల రద్దే భాజపా లక్ష్యం: కేజ్రీవాల్‌

లఖ్‌నవూ: దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్‌సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పునరుద్ఘాటించారు. భాజపా అధికారంలోకి వస్తే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తదుపరి ప్రధాని కావడం ఖాయమని చెప్పారు. అలాగే యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను పదవి నుంచి తొలగిస్తారన్నారు. ‘‘భాజపా నేతలు ఎల్లప్పుడూ రిజర్వేషన్లకు వ్యతిరేకం. వారు అధికారంలోకి వచ్చాక రాజ్యాంగాన్ని మార్చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తారు’’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. గురువారం ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 75 ఏళ్లు నిండిన నేతలకు ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఎటువంటి పదవులు ఇవ్వరాదని, అటువంటివారు రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలనే నిబంధనను మోదీయే తీసుకొచ్చారని కేజ్రీవాల్‌ గుర్తుచేశారు. దీని కారణంగానే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీ సహా పలువురు భాజపా నేతలు పదవులు కోల్పోవడం  జరిగిందన్నారు. మోదీకి వచ్చే ఏడాది 75 ఏళ్లు దాటుతాయని, అమిత్‌ షాను దేశ ప్రధానిని చేయాలని నిర్ణయించేశారని తెలిపారు.

తమ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌పై దాడి విషయమై స్పందించేందుకు కేజ్రీవాల్‌ నిరాకరించారు. అఖిలేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఈ అంశం కంటే ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img