icon icon icon
icon icon icon

పదే పదే దక్షిణాదికి ప్రధాని!.. పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నం

దక్షిణాది రాష్ట్రాలపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న కమల నాధులు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ప్రధాని మోదీ పదే పదే దక్షిణాదిలోని 5 రాష్ట్రాల్లో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు.

Updated : 07 May 2024 11:17 IST

గత నెల 17దాకా పదేళ్లలో 146 సార్లు రాక
గత మూడేళ్లలోనే 59 సార్లు..
ఎన్నికల వేళ మరిన్ని పర్యటనలకు సిద్ధం

దక్షిణాది రాష్ట్రాలపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న కమల నాధులు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ప్రధాని మోదీ పదే పదే దక్షిణాదిలోని 5 రాష్ట్రాల్లో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ ఎక్కువసార్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. 2014 మే 26 నుంచి 2024 ఏప్రిల్‌ 17వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులలో ఆయన 146 సార్లు పర్యటించారు. తన రెండు విడతల పదవీ కాలంలో 73 సార్ల చొప్పున ఈ 5 రాష్ట్రాల్లో    తిరిగారు. ప్రధాని కార్యాలయంలోని రికార్డుల ప్రకారం.. గత మూడేళ్లలోనే దక్షిణాది రాష్ట్రాల్లో 59 పర్యటనలు జరిపారు.

  •  తన తొలి విడత పదవీ కాలంలో దేశవ్యాప్త పర్యటనల్లో 14శాతంగా ఉన్న  దక్షిణాది రాష్ట్రాల పర్యటన రెండో విడత పదవీ కాలంలో 18శాతానికి పెరిగింది.
  •  2019లో ఆయన అత్యధికంగా ఒక ఏడాదిలో 185 పర్యటనలు జరిపారు.
  •  కొవిడ్‌ కారణంగా 2020లో ఆయన కేవలం 23 పర్యటనలకే పరిమిత మయ్యారు.
  •  దేశం మొత్తం జరిపిన 928 పర్యటనల్లో 460 అధికారిక, 382 అనధికారిక, 86 అధికారిక, అనధికార పర్యటనలున్నాయి.

దేశవ్యాప్తంగా 928 సార్లు..

ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా గత పదేళ్లలో 928 పర్యటనలు జరిపారు. తొలి విడతలో (2014-2019) 520, రెండో విడతలో (2019 మే తర్వాత) 408 సార్లు రాష్ట్రాల్లో   పర్యటించారు.

  • ప్రధాని అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 153సార్లు పర్యటించారు.
  • ఈ మొత్తం పర్యటనలు 696 రోజుల్లో ఆయన జరిపారు. ఒకే రోజు పలు రాష్ట్రాల్లో పర్యటించిన   సందర్భాలుఉన్నాయి.

    దక్షిణాదికి ఈ ఏడాదిలో ఎన్నిసార్లు?

  • 2022: 13

  • 2023: 23

  • 2024: (ఏప్రిల్‌ 17 వరకు) 23 


3 రాష్ట్రాల్లో ఒక్కసీటూ గెలవని పార్టీ

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భాజపా ఒక్క సీటూ గెలవలేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ల వాటా ఆంధ్రప్రదేశ్‌లో   0.97%, కేరళలో 12%, తమిళనాడులో 3.6శాతంగా ఉంది.

  • కర్ణాటకలో 51శాతం ఓట్ల సాధనతో 25 లోక్‌సభ స్థానాలను భాజపా గెలుచుకుంది.
  • తెలంగాణలో 19.65శాతం ఓట్ల సాధనతో 4 సీట్లలో విజయం సాధించింది.

(దక్షిణాదిలో ప్రధాని 146 పర్యటనల్లో 64 అధికారికంగా, 56 పార్టీ తరఫున సాగాయి. ఇందులో భాగంగా ఆయన 356 కార్యక్రమాల్లో పాల్గొన్నారు.)

 ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img