icon icon icon
icon icon icon

సిద్దిపేట జిల్లాను తొలగిస్తామని సీఎం అంటున్నారు : హరీశ్‌రావు

కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని భారాస నేత హరీశ్‌రావు స్పష్టం చేశారు.

Published : 27 Apr 2024 14:03 IST

సిద్దిపేట: కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని భారాస నేత హరీశ్‌రావు స్పష్టం చేశారు. సిద్దిపేటలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ‘‘నాకు పదవులు కాదు.. రైతుల ప్రయోజనాలు ముఖ్యం. నాడు ఓటుకు నోటు.. నేడు దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ అమలు చేస్తారో లేదో చెప్పాలి. హామీలు అమలయ్యే వరకూ పోరాటం చేస్తూనే ఉంటా. సిద్దిపేట జిల్లాను తొలగిస్తామని సీఎం చెబుతున్నారు. జిల్లాలు ఉండాలంటే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి’’ అని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img