icon icon icon
icon icon icon

Harish Rao: ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే రేవంత్‌కు సన్మానం చేస్తా: హరీశ్‌రావు

సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోసారి తెలిపారు.

Updated : 03 May 2024 17:30 IST

సిద్దిపేట: సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోసారి తెలిపారు. పంద్రాగస్టు లోగా కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేస్తే.. రాజీనామా చేస్తానని పునరుద్ఘాటించారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ బాండ్‌ పేపర్‌ బౌన్స్‌ అయ్యిందని వ్యాఖ్యానించిన ఆయన.. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే సీఎం రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. 

ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేస్తే సిద్దిపేటలో రేవంత్‌రెడ్డికి సన్మానం చేస్తానని తెలిపారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌.. ఆ గడువు దాటిపోయినా పత్తా లేదని, ఇప్పుడు ఆగస్టు 15లోగా చేస్తామని చెబుతున్నారని హరీశ్‌ విమర్శించారు. ‘‘ పదవుల కోసం చిల్లర రాజకీయాలు చేయడం నాకు అలవాటు లేదు. రాష్ట్రాన్ని తెచ్చింది సిద్దిపేటనే. తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్‌. తెలంగాణకు, కేసీఆర్‌కు.. రేవంత్‌రెడ్డి రుణపడి ఉండాలి. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని రేవంత్‌ చెప్పడం పచ్చి అబద్ధం. అది ప్రజలందరికీ తెలుసు’’ అని హరీశ్‌రావు అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img