icon icon icon
icon icon icon

Vinod Kumar: పార్లమెంట్‌ సభ్యత్వం పునరావాస కేంద్రమా?: వినోద్‌కుమార్‌

తెలంగాణ తెచ్చిన భారాస పార్టీ పార్లమెంట్‌లో ఉండాల్సిన అవసరం ఉందని కరీంనగర్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి బి. వినోద్‌ కుమార్ అన్నారు.

Published : 20 Apr 2024 16:51 IST

కరీంనగర్‌: తెలంగాణ తెచ్చిన భారాస పార్టీ పార్లమెంట్‌లో ఉండాల్సిన అవసరం ఉందని కరీంనగర్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి బి. వినోద్‌ కుమార్ అన్నారు. నామినేషన్‌ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌లో నవోదయ విద్యాలయాల గురించి తెలంగాణ నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. విభజన చట్టంలోని హామీలను భాజపా నెరవేర్చలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో నేను ఎంపీగా ఉంటే రాష్ట్రానికి నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చేవాడినని, కరీంనగర్‌ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు తెచ్చేవాడినని అన్నారు.

ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారికి, ఎంపీ టికెట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌ సభ్యత్వం పునరావాస కేంద్రమా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్న సంకల్పం ఉన్నవారినే ఎన్నుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఆగిపోయిందని, భారాస గొంతు పిసికేందుకు హస్తం, భాజపా ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, కౌశిక్‌రెడ్డి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img