icon icon icon
icon icon icon

KCR: కడియం శ్రీహరి పార్టీ ఎందుకు మారారో చెప్పాలి?: కేసీఆర్‌

రాష్ట్రంలో భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా కాంగ్రెస్‌ నేతలు కమీషన్లు అడుగుతున్నారని భారాస అధినేత కేసీఆర్‌ ఆరోపించారు.

Published : 28 Apr 2024 22:34 IST

వరంగల్‌: రాష్ట్రంలో భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా కాంగ్రెస్‌ నేతలు కమీషన్లు అడుగుతున్నారని భారాస అధినేత కేసీఆర్‌ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి వరంగల్‌లో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో భారాస ఎంపీలు గెలిస్తేనే తెలంగాణకు క్షేమమని, ప్రజల తరఫున పోరాడే భారాసను గెలిపించాలని కోరారు. కడియం శ్రీహరి పార్టీ ఎందుకు మారారో చెప్పాలన్నారు. ఆయనే తన రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా సమాధి చేసుకున్నారని విమర్శించారు. తెలంగాణ జీవనాధారమైన గోదావరిని కావేరికి అనుసంధానం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంటే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు అడ్డుకోవట్లేదని ఆక్షేపించారు. కాళేశ్వరం నిర్మాణంతో జిల్లాకు పుష్కలంగా సాగునీరు వచ్చింది.. అడ్డగోలు హామీలు చూసి మోసపోతే తెలంగాణకు మళ్లీ గోస వచ్చింది అని కేసీఆర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img