icon icon icon
icon icon icon

KCR: భాజపాకు ఓటు అడిగా నైతిక హక్కు లేదు: కేసీఆర్‌

 పదేళ్ల భాజపా పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని భారాస అధినేత కేసీఆర్‌ ఆరోపించారు.

Published : 25 Apr 2024 22:56 IST

భువనగిరి: పదేళ్ల భాజపా పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని భారాస అధినేత కేసీఆర్‌ ఆరోపించారు. రాష్ట్రానికి ఏమీ చేయని ఆ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. రెండో రోజు సూర్యాపేట నుంచి ప్రారంభమైన కేసీఆర్‌ బస్సు యాత్ర.. అర్వపల్లి, తిరుమలగిరి, పెంబర్తిమీదుగా భువనగిరి చేరుకుంది. ఎంపీ అభ్యర్థితో కలిసి ర్యాలీగా వచ్చిన కేసీఆర్‌ భువనగిరి చౌరస్తాలో ప్రసంగించారు.

ఒక పార్టీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతోందని, మరొక పార్టీ ఎక్కడికి వెళితే అక్కడ దేవుడిపై ఒట్టు వేస్తోందని దుయ్యబట్టారు. అద్భుతమైన యాదాద్రి ఆలయాన్ని నిర్మించుకున్నామని, ఏనాడూ ఆలయాన్ని రాజకీయాలకు వాడుకోలేదన్నారు. భారాస, భాజపా రెండూ ఒక్కటే అంటున్న కాంగ్రెస్‌.. భువనగిరిలో చేసింది ఏమిటని ప్రశ్నించారు. భాజపా, కాంగ్రెస్‌ రెండూ ములాకత్‌ అయ్యాయన్నారు.

దేశంలో అనేక సమస్యలు ఉంటే అవేమీ పట్టనట్టు.. అక్షింతలు, ప్రసాదాలు, శోభాయత్రలపైనే భాజపా దృష్టి పెట్టిందని కేసీఆర్‌ విమర్శించారు. ఇక్కడో కేంద్ర మంత్రి ఉన్నా.. రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. కొత్త రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకున్నామని, రెప్పపాటు కరెంటు పోకుండా చూసుకున్నామన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ అన్ని వ్యవస్థలను నాశనం చేసిందన్నారు. భగవంతుడు తనను తెలంగాణ కోసమే పుట్టించాడని, ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ అభివృద్ధే లక్ష్యమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img