icon icon icon
icon icon icon

KTR: పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు వేస్తే హైవేలపై టోల్‌ ఛార్జీలు ఎందుకు?: కేటీఆర్‌

పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం పేదల రక్తం పీల్చి రూ.కోట్లు వసూలు చేసిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు.

Updated : 06 May 2024 14:24 IST

సిరిసిల్ల: పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం పేదల రక్తం పీల్చి రూ.కోట్లు వసూలు చేసిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. పెట్రోల్‌, డీజిల్‌పై పన్నుల రూపంలో గత పదేళ్లలో రూ.30 లక్షల కోట్లు వసూలు చేశారన్నారు. అదానీ, అంబానీలకు రూ.14.5 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని ఆరోపించారు. తాను చెప్పింది తప్పని భాజపా నేతలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు.

‘‘కరీంనగర్‌ స్థానంలో పోటీ కాంగ్రెస్‌తో కాదు. లోక్‌సభ ఎన్నికల్లో భారాసను 10-12 సీట్లలో గెలిపిస్తే 6 నెలల్లో కేసీఆర్‌ రాష్ట్రాన్ని శాసించే స్థితికి వస్తారు. మోదీ సెస్సుల రూపంలో కొత్త పన్నులు వసూలు చేశారు. హైవేల కోసం ఇలా చేస్తున్నట్లు సమర్థించుకుంటున్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు వేస్తే హైవేలపై టోల్‌ ఛార్జీలు ఎందుకు? వీటిపై ప్రశ్నిస్తే భాజపా వద్ద జవాబు లేదు’’ అని కేటీఆర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img