icon icon icon
icon icon icon

Pocharam Srinivas Reddy: బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌: పోచారం

రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన అయిదు నెలల్లోనే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని భారాస నేత, శాసనసభ మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి విమర్శించారు.

Published : 03 May 2024 23:50 IST

మెదక్‌: రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అయిదు నెలల్లోనే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని భారాస నేత, శాసనసభ మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ప్రజలు కూడా చుక్కలు చూపించాలంటే లోక్‌సభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. మెదక్‌ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా గురువారం మెదక్‌ జిల్లాలోని కౌడిపల్లి, కొల్చారంలో పోచారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత అసెంబ్లీ ఎన్నికల్లో మోసపోయామని, మరోసారి మోసపోవద్దు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి. ఆలోచించకుండా ఓటేస్తే నష్టపోయేది ప్రజలే. మన ఓటు ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకోవాలి’’ అని పేర్కొన్నారు. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img