icon icon icon
icon icon icon

Revanth Reddy: కేసీఆర్ చేసిన రైతు రుణమాఫీ బ్యాంకుల వడ్డీకే చాల్లేదు: రేవంత్‌రెడ్డి

ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఐదింటిని 100 రోజుల్లోనే అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 

Updated : 23 Apr 2024 19:15 IST

మద్దూరు: ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఐదింటిని 100 రోజుల్లోనే అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా.. కేసీఆర్‌ మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ఆయన చేసిన రైతు రుణమాఫీ బ్యాంకుల వడ్డీకే సరిపోలేదని విమర్శించారు. నారాయణపేట జిల్లా మద్దూరులో పార్టీ కార్యకర్తలతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్‌ బిడ్డకు కాంగ్రెస్‌ సీఎం, పీసీసీ పదవిని ఇచ్చిందన్నారు.

‘‘కేసీఆర్‌ చేసిన అప్పులకు మేం రూ.24వేల కోట్లు వడ్డీ కట్టా్ం. రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని నేను హామీ ఇచ్చా. ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేస్తా. నేను రుణమాఫీ చేసిన వెంటనే కేసీఆర్‌ భారాసను రద్దు చేస్తారా?ఏ రైతూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. రైతులను బ్యాంకులు ఇబ్బంది పెట్టొద్దు. రుణమాఫీ చేసే బాధ్యత నాది. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలి. భాజపా నేతలు దేవుడిని రోడ్లపైకి తెస్తున్నారు. దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. మోదీ ఏ హామీని నెరవేర్చలేదు’’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img