icon icon icon
icon icon icon

Chittor: మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల ఘాతుకం.. బీసీవైపీ అధ్యక్షుడిపై దాడికి యత్నం

చిత్తూరు జిల్లా సదుం పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీవైపీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌పై వైకాపా నేతలు దాడికి యత్నించారు.

Updated : 29 Apr 2024 21:07 IST

సదుం: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు ఘాతుకానికి పాల్పడ్డారు. భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌పై దాడికి యత్నించారు. దీంతో సదుం పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సదుం మండలం ఎర్రాతివారిపల్లెలో ప్రచారం నిర్వహించేందుకు రామచంద్రయాదవ్‌ వెళ్లారు. మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామంలో బీసీవైపీ ప్రచారం నిర్వహించడంపై పెద్దిరెడ్డి బంధువు వేణుగోపాల్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదో రకంగా ప్రచారం ముగించుకొని రామచంద్రయాదవ్‌ వెనక్కి వచ్చేశారు. మరో గ్రామంలో ప్రచారం చేస్తుండగా పెద్దిరెడ్డి వర్గీయులు రామచంద్రయాదవ్‌పై దాడికి యత్నించారు. పోలీసులు జోక్యం చేసుకొని ఆయన్ను సదుం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడికి చేరుకున్న వైకాపా నాయకులు వీరంగం సృష్టించారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. కాన్వాయ్‌లోని వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీస్‌ స్టేషన్‌పైనా దాడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీస్‌స్టేషన్‌ వద్దకు వైకాపా కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

రెండు రోజుల క్రితం పుంగనూరు మండలంలోని మాగాండ్లపల్లెలోనూ బీసీవైపీకి ఇదే తరహా అనుభవం ఎదురైంది. రామచంద్రయాదవ్‌ ప్రచారం నిర్వహిస్తుండగా.. గ్రామంలోని వైకాపా కార్యకర్త శశిభూషణ్‌రెడ్డికి కరపత్రం అందజేసే సమయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. మాటమాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డాయి. దాడిలో బీసీవైపీకి చెందిన ఓ వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఆ పార్టీ కార్యకర్త నారాయణ గాయపడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడ్డ నారాయణను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img