icon icon icon
icon icon icon

Andhra New: స్ట్రాంగ్‌ రూమ్‌లో ఈవీఎంల భద్రతపై తెదేపా ఆందోళన

స్ట్రాంగ్‌ రూమ్‌లో ఈవీఎంల భద్రతపై రాష్ట్ర ఎన్నిల ప్రధానాధికారి ఎంకే మీనాకు పొన్నూరు తెదేపా అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ఫిర్యాదు చేశారు.

Published : 15 May 2024 16:34 IST

అమరావతి: స్ట్రాంగ్‌ రూమ్‌లో ఈవీఎంల భద్రతపై రాష్ట్ర ఎన్నిల ప్రధానాధికారి ఎంకే మీనాకు పొన్నూరు తెదేపా అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ఫిర్యాదు చేశారు. ఈనెల 14న నాగార్జున వర్సిటీలో స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద సీఎం భద్రతా సిబ్బంది భేటీ అయ్యారని తెలిపారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భేటీ కావడం నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమావేశంలో సిద్ధం పోస్టర్‌ను ప్రదర్శించారని, వైకాపా నేతలు కూడా పాల్గొన్నారని వివరించారు. ఈవీఎం స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భద్రత పెంచాలని కోరారు. ఓటమి భయంతో వైకాపా కుట్రలకు పాల్పడే అవకాశముందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img