బాబోయ్‌.. ఏనుగుల గుంపు!

అసోం గోలగఢ్‌ జిల్లాలోని నుమాలిఘడ్‌లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి

Published : 06 Nov 2020 23:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అసోం గోలగఢ్‌ జిల్లాలోని నుమాలిఘడ్‌లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జనావాస ప్రాంతాల్లోకి భారీ సంఖ్యలో వచ్చిన గజరాజులను చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వాటిని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించిన వారిపై ఏనుగులు దాడికి ప్రయత్నించాయి. స్థానికుల ఇళ్లపై దాడి చేసిన తరువాత ఆ ఏనుగుల గుంపు టీ తోటల్లోకి వెళ్లిపోయింది. అనంతరం 39వ జాతీయ రహదారిని దాటుతుండగా వాటిని తరిమేందుకు అధిక సంఖ్యలో ప్రజలు గుమికూడారు. కొన్ని ఏనుగులు వారిపై దాడికి యత్నించాయి. జాతీయ రహదారిపై వాహనాల్లో ఉన్నవారు ఏనుగుల రాకను తమ వాహనాలను విడిచిపెట్టి పరుగులు తీశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని