షార్ట్‌తో వీడియో కాల్ మీటింగ్‌కు..!
కరోనా వైరస్ వచ్చి ‘వర్క్ ఫ్రం హోమ్’ అనే మాటను ప్రస్తుతం చాలా మందికి పరిచయం చేసింది. ఎందుకంటే వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు వర్క్ ఫ్రొం హోం అవకాశాన్ని కల్పించాయి.
ఇంటర్నెట్‌డెస్క్: కరోనా వైరస్ వచ్చి ‘వర్క్ ఫ్రం హోమ్’ అనే మాటను ప్రస్తుతం చాలా మందికి పరిచయం చేసింది. ఎందుకంటే వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు వర్క్ ఫ్రొం హోం అవకాశాన్ని కల్పించాయి. అందులో భాగంగా ముఖ్యమైన సమావేశాలు కూడా ఆన్లైన్లోనే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇంటి నుంచే పని అంటే తెలియనిది ఏముంది. ఇంటి నుంచే పని కాబట్టి వేషధారణ ఎలా ఉన్నా ఏం కాదులే అని భావించి అందరూ సాధారణంగా తయారవుతారు. ఈ క్రమంలో ఓ ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన వీడియో కాల్ మీటింగ్ తాలూకు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వర్క్ ఫ్రం హోమ్‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులు సాధారణంగా సూట్ వేసుకుని వీడియో కాల్ ద్వారా ఆన్లైన్లో సమావేశానికి హాజరవుతారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కుమారుడు మధ్యలో దూరి సమావేశానికి ఆటంకం కలిగిస్తాడు. దీంతో ఆ పిల్లాడ్ని బయటకు పంపడానికి ఆ వ్యక్తి లేవడంతో అతడు షార్ట్ ధరించి ఉండటం చూసి మిగతా ఇద్దరూ నైస్ షార్ట్ అంటూ నవ్వుతారు. ఇంతలో మరో వ్యక్తి ఇంట్లోనూ శబ్దం కావడంతో అతడూ పైకి లేస్తాడు. అక్కడా అదే సీన్ రిపీట్ అవుతుంది. ఇలా వారు షార్ట్‌లు వేసుకుని వీడియో కాల్ సమావేశానికి హాజరు కావడం ఎంతో హాస్యాస్పదంగా ఉండటంతో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ‘నైస్ షార్ట్స్’ అంటూ కొందరు, ‘పిల్లాడి డ్యాన్స్ బాగుంది’ అంటూ మరికొందరు చమత్కారంగా కామెంట్లు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్‌ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్‌ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్‌లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు