TS EAMCET: ఎంసెట్‌ బైపీసీ అభ్యర్థులకు మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి

ఎంసెట్‌ బైపీసీ అభ్యర్థులకు మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. బీఫార్మసీలో 116 కాలేజీల్లో 7,586 సీట్లు ఉండగా.. మొదటి విడతలో 7,433 భర్తీ కాగా మరో 153 మిగిలాయి.

Updated : 09 Nov 2022 01:06 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ బైపీసీ అభ్యర్థులకు మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. బీఫార్మసీలో 116 కాలేజీల్లో 7,586 సీట్లు ఉండగా.. మొదటి విడతలో 7,433 భర్తీ కాగా మరో 153 మిగిలాయి. ఫార్మ్‌-డీలో 60 కాలేజీల్లో 13,121 సీట్లు ఉండగా అన్నీ భర్తీ అయ్యాయి. బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌, ఫార్మస్యూటికల్‌ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ కోర్సుల్లో 164 సీట్లు ఉండగా.. అన్నీ భర్తీ అయ్యాయి. ప్రభుత్వ, యూనివర్సిటీ కాలేజీలు, ప్రైవేటు వర్సిటీల్లో సీట్లన్నీ మొదటి విడతలోనే భర్తీ అయ్యాయి. మొదటి విడతలో సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 13వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్‌ చేయాలని ప్రవేశాల కన్వీనర్‌, సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. తుది విడత కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత ఈనెల 22 నుంచి 25లోగా కాలేజీల్లో చేరాలని విద్యార్థులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని