CRDA: రాజధాని రైతులకు ప్లాట్లు.. ఈ-లాటరీకి సీఆర్డీఏ ప్రకటన

రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లను ఈ-లాటరీ ద్వరా కేటాయించాలని సీఆర్డీఏ నిర్ణయించింది.

Published : 03 Feb 2024 20:50 IST

అమరావతి: రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లను ఈ-లాటరీ ద్వారా కేటాయించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. దీని కోసం ఇప్పటి వరకు రెండు సార్లు ప్రకటన జారీ చేసినా రైతుల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో మూడో విడత ఈ-లాటరీ నిర్వహించేందుకు ప్రకటన జారీ చేసింది. గ్రామాల వారీగా నివాస, వాణిజ్య స్థలాలు కేటాయించేందుకు ప్రకటనలు ఇస్తోన్న సీఆర్డీఏ వైఖరికి నిరసనగా రైతులు గైర్హాజరవుతున్నారు. దీంతో మరో అవకాశం కల్పిస్తున్నట్టు సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

రాజధాని ప్రాంతంలోని ఐనవోలు, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు, అనంతవరం గ్రామాలకు ఫిబ్రవరి 5న, కురగల్లు, నెక్కల్లు, నిడమర్రు, గ్రామాలకు ఫిబ్రవరి 6న, వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం, మందడం, కొండమరాజపాలెం గ్రామాలకు ఫిబ్రవరి 7న, నవులూరు, లింగాయపాలెం, వెంకటపాలెం, రాయపూడి గ్రామాల రైతులకు ఫిబ్రవరి 8న ఈ-లాటరీ ప్రక్రియ నిర్వహిస్తామని సీఆర్డీఏ తెలియజేసింది. మరోవైపు రైతులు ఆందోళన చెందుతున్నట్టుగా మాస్టర్ ప్లాన్‌లో ఎలాంటి మార్పులూ చేయలేదని.. 16 గ్రామాల రైతులకు లేఆవుట్ ప్లాన్లు అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటనలో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని