CM Jagan: తపసిపుడిలో సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

కృష్ణా జిల్లా బందరు పోర్టు శంకుస్థాపన  కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Published : 22 May 2023 11:47 IST

మచిలీపట్నం: కృష్ణా జిల్లా బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా తపసిపుడి గ్రామానికి చేరుకున్న సీఎం.. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ పైలాన్‌ను జగన్‌ ఆవిష్కరించారు. 2.2 కిలోమీటర్లు పొడవైన పోర్టు బ్యాక్ వాటర్స్ పనులను సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జగన్‌తో పాటు మంత్రులు రోజా, జోగి రమేశ్‌,  స్థానిక ఎమ్మల్యే పేర్నినాని, విప్ ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు.

బందరు పోర్టు నిర్మాణానికి 2008 ఏప్రిల్‌ 23న అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిన కరగ్రహారం పంచాయతీ పరిధిలోని పల్లిపాలెం దగ్గర మొదటి సారి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. అదే పోర్టుకు తెదేపా ప్రభుత్వ హయాంలో 2019 ఫిబ్రవరి 7న మేకవానిపాలెం దగ్గర చంద్రబాబు రెండో సారి శంకుస్థాపన చేశారు. అప్పుడూ వివిధ కారణాలతో పోర్టు నిర్మాణ పనులు మొదలు కాలేదు. తాజాగా సీఎం జగన్‌ చేతుల మీదుగా మూడోసారి శంకుస్థాపన జరిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని