Ap News: పీఆర్‌సీ ఆమోదయోగ్యంగా లేదు: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ ప్రకటించిన పీఆర్‌సీ ఆమోదయోగ్యంగా లేదంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగ సంఘాలతో పలు దఫాలుగా

Updated : 12 Jan 2022 20:08 IST

అమరావతి‌: ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ ప్రకటించిన పీఆర్‌సీ ఆమోదయోగ్యంగా లేదంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగ సంఘాలతో పలు దఫాలుగా ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొన్నారు. అసుతోష్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇచ్చి ఉండాల్సిందని వారు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సచివాలయంలో ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సీఎస్‌ సమీర్‌ శర్మను కలిసి విజ్ఞాపన పత్రం అందించారు.

‘‘2010లోనే అప్పటి పీఆర్‌సీ సిఫార్సుల మేరకు 39 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. ప్రస్తుతం 30 శాతమైనా ప్రకటించి ఉండాల్సింది. గత ప్రభుత్వం కూడా ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ 30 శాతంగా పీఆర్‌సీ ఉంది. పీఆర్‌సీ సంఘం సిఫార్సు చేసినట్టుగా ఇంటి అద్దె భత్యం, సీసీఏలు యథాతథంగా కొనసాగడమే కాకుండా హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు ఇచ్చే భత్యాలు అలాగే కొనసాగించాలి. 70-79 ఏళ్ల మధ్య ఉన్న పెన్షనర్లకు అదనంగా 10 శాతం పెన్షన్ ఇవ్వాలి. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు చెల్లించాలి. వెంటనే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రోబేషన్ డిక్లేర్ చేయాలి. 1993 నుంచి పనిచేస్తున్న 5 వేల మంది కంటింజెంట్, కాంట్రాక్టు ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలి. పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నాం’’ అని సీఎస్‌కు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని