రమణ దీక్షితుల నియామకం చట్టవిరుద్ధం

తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులను నియమించడాన్ని సవాల్ చేస్తూ వేణుగోపాల దీక్షితులు దాఖలు చేసిన పిటీషన్

Published : 06 May 2021 01:21 IST

పిటిషన్‌పై హైకోర్టులో విచారణ 

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులను నియమించడాన్ని సవాల్ చేస్తూ వేణుగోపాల దీక్షితులు దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకునిగా కొనసాగుతుండగా ప్రభుత్వం రమణ దీక్షితులను నియమించటం చట్టవిరుద్ధమని వేణుగోపాల దీక్షితులు తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 74ఏళ్ల వ్యక్తిని ప్రధాన అర్చకులుగా నియమించారన్నారు. మరోవైపు నిబంధనల ప్రకారమే ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులను నియమించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది న్యాయస్థానానికి విన్నవించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని