Ap High Court: అయ్యన్నపై సీఐడీ దర్యాప్తు కొనసాగించొచ్చు: ఏపీ హైకోర్టు

నకిలీ ఎన్‌ఓసీ సమర్పించి 0.16 సెంట్ల జలవనరుల శాఖ భూమిని కబ్జా చేశారని తెదేపా నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తనపై నమోదు చేసిన భూఆక్రమణ కేసును కొట్టివేయాలని సవాల్‌ చేస్తూ అయ్యన్న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.

Updated : 09 Nov 2022 19:58 IST

అమరావతి: నకిలీ ఎన్‌ఓసీ సమర్పించి 0.16 సెంట్ల జలవనరుల శాఖ భూమిని కబ్జా చేశారంటూ తెదేపా నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తనపై నమోదు చేసిన భూఆక్రమణ కేసును కొట్టివేయాలంటూ అయ్యన్న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.

అయ్యన్నపై కావాలనే సెక్షన్ 467 నమోదు చేశారని, అసలు ఈ కేసులో సెక్షన్‌ 467 చెల్లదని విచారణ సందర్భంగా అయ్యన్న తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కావాలని ఫోర్జరీ చేశారని, దీనిపై ఈఈ ఫిర్యాదు చేస్తే ఆయనను భయపెట్టడం, బెదిరించడం లాంటివి చేసినందున సెక్షన్ 467 వర్తిస్తుందని సీఐడీ తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించి అయ్యన్నపై నమోదైన కేసులో సెక్షన్ 467 వర్తించదని స్పష్టం చేసింది. సీఆర్‌పీసీ నిబంధనల ప్రకారం 41ఏ కింద నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. అయ్యన్నపై సీఐడీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని