TTD: తితిదే పాలక మండలి సభ్యులుగా 24 మందికి అవకాశం

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 24 మందికి బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించారు.

Updated : 25 Aug 2023 22:21 IST

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలకమండలి సభ్యులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 24 మందికి బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించింది. తితిదే సభ్యులుగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, పొన్నాడ సతీష్‌ కుమార్‌, తిప్పేస్వామి, అశ్వత్థ నాయక్‌, నాగసత్యం యాదవ్‌ తదితరులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తితిదే ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. తాజాగా 24 మందితో పాలకమండలి సభ్యుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సి ఉంది.

తితిదే పాలక మండలి సభ్యులు వీరే..

  • పొన్నాడ వెంకట సతీశ్‌ కుమార్‌ (ఎమ్మెల్యే)
  • ఉదయభాను సామినేని (ఎమ్మెల్యే)
  • ఎం.తిప్పేస్వామి (ఎమ్మెల్యే)
  • సిద్దవటం యండయ్య
  • చిందె అశ్వర్థనాయక్‌
  • మేకా శేషుబాబు
  • ఆర్‌. వెంకటసుబ్బారెడ్డి
  • ఎల్లారెడ్డిగారి సీతారామరెడ్డి
  • గడిరాజు వెంకట సుబ్బరాజు
  • పెనక శరత్‌చంద్రారెడ్డి
  • రామ్‌రెడ్డి సాముల
  • బాలసుబ్రమణియన్‌ పళనిస్వామి (తమిళనాడు)
  • ఎస్‌.ఆర్‌. విశ్వనాథ్ రెడ్డి
  • గడ్డం సీతారెడ్డి
  • కృష్ణమూర్తి వైద్యనాథన్‌ (తమిళనాడు)
  • సిద్దా వీర వెంకట సుధీర్‌ కుమార్‌
  • సుదర్శన్‌ వేణు
  • నెరుసు నాగ సత్యం
  • ఆర్‌.వి.దేశ్‌పాండే (కర్ణాటక)
  • అమోల్‌ కాలె ( మహారాష్ట్ర, ముంబయి క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు)
  • డా.ఎస్‌.శంకర్‌ ( మహారాష్ట్ర)
  • మిలింద్‌ కేశవ్‌ నర్వేకర్‌ (మహారాష్ట్ర, ముంబయి క్రికెట్‌ సంఘం సభ్యుడు)
  • డా కేతన్‌ దేశాయ్‌ (గుజరాత్‌)
  • బోరా సౌరభ్‌
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని