అక్కడ చట్టాలకు లోబడే పిల్లలకు పేర్లు!
ఇంటర్నెట్ డెస్క్: పిల్లలకు నామకరణం చేయడం తల్లిదండ్రులకు పెద్ద సవాలే. కొత్తగా, విభిన్నంగా ఉండాలి.. ఆకట్టుకోవాలి అంటూ పేర్ల పుస్తకాలు, వెబ్సైట్లలో ఆన్వేషిస్తారు. బిడ్డ పుట్టక ముందే బాబు అయితే ఏ పేరు పెట్టాలి, పాప అయితే ఏ పేరు పెట్టాలని తెగ ఆలోచిస్తారు. మన దేశంలో అయితే బిడ్డ పుట్టిన నక్షత్రం, తిథులను బట్టి నచ్చిన పేర్లు పెడుతుంటారు. ఇలా ప్రపంచంలోని చాలా దేశాల్లో తల్లిదండ్రులకు తమకు నచ్చిన పేర్లను పిల్లలకు పెట్టే స్వేచ్ఛ ఉంది.. కానీ, కొన్ని దేశాల్లో మాత్రం ఆ స్వేచ్ఛ లేదు. అక్కడి చట్టాలకు లోబడే పిల్లలకు నామకరణం చేయాల్సి ఉంటుంది. మరి ఆ దేశాలేవో.. చట్టాలేవో తెలుసుకుందాం పదండి..
కంప్యూటర్ స్కానర్ గుర్తించేలా..
చైనాలో బిడ్డ పుట్టగానే కుటుంబసభ్యులు జ్యోతిషులను సంప్రదించి వారు సూచించిన పేర్లు పెడుతుంటారు. అయితే, కొన్నాళ్లుగా జ్యోతిషులు చెప్పిన సూచనలతోపాటు ప్రభుత్వ సూచనలు కూడా పాటించాల్సి వస్తోంది. చైనాలో ప్రతి ఒక్కరికి పౌర గుర్తింపు కార్డు ఉంటుంది. దాంట్లో ఉండే వ్యక్తి పేరు కంప్యూటర్ స్కానర్లు సులువుగా గుర్తించే విధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకే బిడ్డకు క్లిష్టమైనవి కాకుండా చదవడానికి సరళంగా ఉండేలా పేర్లు పెట్టాలని సూచించింది. అంతేకాదు.. ఆ పేర్లు దేశ సంప్రదాయాలు, సంస్కృతి ప్రతిబింబించేలా ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. విదేశీ పేర్లు, ఇతర సింబల్స్‌ను ప్రభుత్వం అనుమతించదు. ఇంటి పేరు ఒకే అక్షరంతో ఉండాలి. కొన్ని తెగలవారికి ఇంటి పేర్లు ఉండవు. దాంతో గుర్తింపు కార్డుల్లో ఇంటి పేరు స్థానంలో XXX అని రాస్తారు.
ఎంపిక చేసిన జాబితా నుంచే
డెన్మార్క్‌లో ఎవరికైనా పేరు పెట్టాలంటే అక్కడి ప్రభుత్వం ఎంపిక చేసిన (దాదాపు 18వేల అమ్మాయిల పేర్లు, 15వేల అబ్బాయిల పేర్లు) పేర్ల జాబితా నుంచి ఒకదాన్ని ఎంచుకోవాలి. ఒకవేళ ఇవి కాకుండా కొత్త పేరు పెట్టాలంటే స్థానిక భాషలో పేరు అయితే స్థానిక ప్రభుత్వ కార్యాలయం నుంచి, విదేశీ పేరు అయితే ఆ దేశ రాయబార కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పేరులోనే బిడ్డ అమ్మాయా? అబ్బాయా? అనేది తెలిసేలా ఉండాలి. అమ్మాయికి అబ్బాయి పేరు పెట్టడం, అబ్బాయికి అమ్మాయి పేరు పెట్టడం నిషేధం. అలాగే పేరులో ఇంటిపేరు ఉండకూడదు. హంగేరీలోనూ ప్రభుత్వాలు ఎంపిక చేసిన పేర్ల జాబితా నుంచే పేర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఇంటిపేరు తప్పనిసరి
ఫిన్లాండ్లో ఏ వ్యక్తి అయినా ఇంటిపేరును కలిగి ఉండాల్సిందే. అనాథ అయినా ఎవరిదైనా ఇంటిపేరు పెట్టుకుంటేనే ప్రభుత్వం వారిని ఫిన్లాండ్ పౌరుడిగా గుర్తిస్తుంది. తల్లిదండ్రులు బిడ్డ పుట్టిన రెండు నెలలలోపల పేరు పెట్టి, ఆ పేరును ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. పేరు ఎంపికలో స్వేచ్ఛ ఉంటుంది. కానీ, కొన్ని నిబంధనలు పాటించాల్సిందే. విదేశీ పేర్లను పెట్టకూడదు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉన్న పేరును పుట్టిన బిడ్డకు మళ్లీ పెట్టకూడదు. ప్రభుత్వ డేటాబేస్‌లో ఆ పేరును తప్పక నమోదు చేయాల్సిందే.
చిన్నారికి పేరు నచ్చకపోతే ఇక అంతే..
ఫ్రాన్స్‌లో తల్లిదండ్రులు వారి బిడ్డకు ఎలాంటి పేరయినా పెట్టొచ్చు. అందులో ఎలాంటి ఆంక్షలు లేవు. అయితే, పౌర జాబితాలో చేర్చేముందు చిన్నారికి ఆ పేరు నచ్చిందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జనన ధ్రువపత్రం జారీ చేసే ముందు స్థానిక కోర్టుకు రిజిస్ట్రార్ ఆ పేరుకు చిన్నారి సమ్మతి ఉందో లేదో నివేదిక సమర్పించాలి. చిన్నారికి తన పేరు నచ్చకపోతే వెంటనే ఆ పేరును తొలగించాలని ఆదేశించే అధికారం కోర్టుకు ఉంటుంది.
వాళ్లు అనుమతిస్తేనే
జర్మనీలో చిన్నారికి పేరు పెట్టాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. ముందు ఒక పేరును ఎంపిక చేసుకోవాలి. అయితే పెట్టే పేర్లలో బిడ్డ అమ్మాయా? అబ్బాయా?అనేది తెలిసిపోవాలి. పేరు ప్రతికూలంగా ఉండకూడదు. కంప్యూటర్ మిషన్లు చదవగలిగేలా ఉండాలి. అలా ఎంపిక చేసిన పేరును స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫీజు కట్టి చెబితే.. ఆ పేరు పెట్టుకోవచ్చో లేదో అధికారులు చెబుతారు. ఒకవేళ వారు ఆ పేరును నిరాకరిస్తే.. మళ్లీ వేరొక పేరు ఎంపిక చేసి ఫీజు కట్టి అనుమతి తీసుకోవాలి.
స్వీడన్‌లోనూ ఒకప్పుడు రాయల్ కుటుంబాలు పెట్టుకునే పేర్లు సాధారణ వ్యక్తులకు పెట్టకూడదని ఓ చట్టం తీసుకొచ్చారు. ఆ తర్వాత చట్టం మారింది. ఇప్పుడు ఎవరైనా తమ బిడ్డకు పేరు పెట్టాలంటే మూడు నెలలలోపల ఆ పేరుకు స్థానిక ప్రభుత్వ ఏజెన్సీ వద్ద అనుమతి పొందాల్సి ఉంటుంది.
తర్జుమా చేసి పెట్టకూడదు
జపాన్ ప్రజలు సంప్రదాయాలను బాగా కాపాడుకుంటారు. ఇందులో భాగంగానే పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పేర్లు పెడుతుంటారు. ఇక్కడి చట్టం ప్రకారం పిల్లలకు పెట్టే పేరుతోపాటు ఇంటి పేరు ఖచ్చితంగా ఉండాలి. విదేశీ భాషలోని ఒక పేరు అర్థాన్ని జపనీస్‌లోకి తర్జుమా చేసి పెట్టకూడదు. పేరు చదవడానికి, పలకడానికి సులువుగా ఉండాలి.
కమిటీ నిర్ణయిస్తుంది
ఐస్లాండ్లో పేరును ఖరారు చేయడానికి కొన్నేళ్ల కిందట ఒక కమిటీ ఏర్పాటైంది. తల్లిదండ్రులు వారి పిల్లలకు పెట్టాలనుకునే పేరులో అభ్యంతరాలు ఉన్నాయా? పెట్టుకోవచ్చా? అనేది ఆ కమిటీ నిర్ణయిస్తుంది. పేరు వ్యాకరణంలో, అర్థంలో ఎలాంటి దోషాలు ఉండకూడదు. ఆ పేరు భవిష్యత్తులో చిన్నారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించదని కమిటీ సభ్యులు నమ్మాలి. ఒక వ్యక్తికి మూడు పేర్లను మించి ఉండకూడదు. ఇవన్నీ పరిశీలించి ఎంచుకున్న పేరుకు కమిటీ సభ్యులు అనుమతిస్తారు.
40అక్షరాలు మించకూడదు
అమెరికాలో తల్లిదండ్రులకు పేర్ల ఎంపికలో స్వేచ్ఛ ఉన్నప్పటికీ ప్రభుత్వం సూచించే కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. అవేంటంటే.. అమెరికా నిబంధన ప్రకారం.. ఒక వ్యక్తికి పెట్టే పేరులో గానీ, ఇంటి పేరులోగానీ 40 అక్షరాలు మించకూడదు. నిజానికి 26 అక్షరాలకే పరిమితి ఉన్నా.. ఆ నిబంధనను కాస్త సడలించి 40కి పెంచారు. అలాగే పేరులో ఎలాంటి అభ్యంతరకర అర్థాలు ఉండకూడదు. ఆస్ట్రేలియాలోనూ పేరులో కేవలం 26 ఆంగ్ల అక్షరాలు మాత్రమే ఉండాలనే నిబంధన ఉంది. చిన్నారులకు ఒకవేళ పెట్టిన పేరు నచ్చకపోతే తల్లిదండ్రులు ఇక అలా పిలవకూడదు.
నిషేధిత జాబితా చూడాలి
వివిధ దేశాల్లో పిల్లలకు పెట్టే పేర్ల విషయంలో ఎంపిక చేసిన జాబితాలు ఉంటే.. మలేషియాలో నిషేధిత పేర్ల జాబితా ఉంటుంది. సంఖ్యలు, రంగులు, కూరగాయాలు, పండ్లు, వస్తువుల పేర్లు పెట్టడం అక్కడ నిషేధం. ఎవరైనా అలాంటి పేర్లు పెట్టినా.. పిలిచినా శిక్షలు విధించే అవకాశముంది. ఒకవేళ నిషేధిత జాబితాలో ఉండే పేరు పెట్టాలని భావిస్తే.. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మొరాకో దేశం కూడా నిషేధిత జాబితాను అలాగే అనుమతి ఉన్న పేర్ల జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది.
ముద్దు పేర్లు వద్దు.. పోర్చుగీసులోనే ఉండాలి
పోర్చుగల్‌లో పిల్లలకు పేర్లు పెట్టడంపై కొన్ని కచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. తల్లిదండ్రులు వారి పిల్లలకు కేవలం పోర్చుగీస్ భాషలోని పేర్లనే పెట్టాలి. ముద్దు పేర్లు పెట్టకూడదు. పేరులోనే వ్యక్తి ఆడా? మగా? అనేది తెలిసేలా ఉండాలి.
ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు అక్కడి ప్రభుత్వం పేర్లతో 82 పేజీల పుస్తకాన్ని ప్రచురించింది. ఎవరైనా తమ పిల్లలకు పేర్లు పెట్టాలంటే ఈ పుస్తకంలో నుంచి ఒక పేరును ఎంచుకోవచ్చు.
ఆ 50 పేర్లు నిషేధం
సౌదీ అరేబియా తమ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటుందని అందరికి తెలిసిందే. కాబట్టి సంప్రదాయంలో భాగంగా ఉండే పేర్లనే తల్లిదండ్రులు వారి పిల్లలకు పెడుతుంటారు. అయితే, ప్రభుత్వం తమకు అభ్యంతరకంగా అనిపించిన 50 పేర్లను నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చింది. నిషేధించిన పేర్లను పెట్టుకుంటే కఠిన శిక్షలు ఉంటాయి. ఇలాంటి పేర్లు కలిగిన విదేశీయులను సౌదీలో అడుగుపెట్టేందుకు అనుమతించరు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Monkey pox: మంకీపాక్స్ ప్రమాదకరం కాదు కానీ... ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Politics News
Eknath Shinde : శివసేన కోసం కొత్త భవనం నిర్మించనున్న శిందే వర్గం..?
-
India News
‘లంచం లేదంటే మంచం’.. కర్ణాటక మాజీ మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
-
Politics News
Telangana News: అక్కడెందుకు సీఎం కేసీఆర్ పర్యటించలేదు?: కోదండరామ్
-
India News
Modi: మిమ్మల్ని కలుసుకోవాలని అప్పుడే అనుకున్నాను..!
-
Crime News
Telangana News: కామారెడ్డిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు
- Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య