CBSE: ‘పది’ ఫలితాలు ఆ రోజేనా?

పదో తరగతి ఫలితాల వెల్లడికి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా పాఠశాలల నుంచి మార్కులు తెప్పించుకున్న సీబీఎస్‌ఈ.. జులై 20న ఫలితాలు వెల్లడించేందుకు.....

Updated : 22 Aug 2022 14:49 IST

దిల్లీ: పదో తరగతి ఫలితాల వెల్లడికి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా పాఠశాలల నుంచి మార్కులు తెప్పించుకున్న సీబీఎస్‌ఈ.. జులై 20న ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధమవుతోంది. దీంతో లక్షలాది మంది విద్యార్థుల ఎదురుచూపునకు తెరపడనుంది. ఫలితాలు వెల్లడి అనంతరం విద్యార్థులు తమ ఫలితాలను cbseresults.nic.in లేదా cbse.gov.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.

కొవిడ్‌ వల్ల పరీక్షలు నిర్వహించలేకపోయిన సీబీఎస్‌ఈ.. విద్యా సంవత్సరం పొడవునా నిర్వహించిన పరీక్షల్లోని మార్కుల ఆధారంగా ఫలితాలను వెల్లడించనుంది. ఎప్పటిలానే అంతర్గత మార్కులకు 20 మార్కులు కేటాయించగా.. మిగిలిన 80 మార్కులను వివిధ పరీక్షల్లోని విద్యార్థులకు వచ్చిన మార్కులు ఆధారంగా కేటాయించనుంది. ఇందుకోసం యూనిట్‌ టెస్టులకు 10, హాఫ్‌ ఇయర్లీ పరీక్షలకు 30, ప్రీ బోర్డు పరీక్షలకు 40 చొప్పున మార్కులు కేటాయించింది. దానికి అనుగుణంగా తుది ఫలితాలను వెల్లడించనుంది. ఎవరైనా విద్యార్థులు పాస్‌ మార్కులు పొందకపోతే గ్రేస్‌ మార్కులు ఇవ్వాలని సీబీఎస్‌ఈ స్కూళ్లకు సూచించింది. అప్పటికీ విద్యార్థులు ఫెయిల్‌ అయితే వారిని ఎసెన్షియల్‌ రిపీట్‌, కంపార్ట్‌మెంట్‌ కేటగిరీలో ఉంచుతారు. ఒకవేళ విద్యార్థులెవరైనా మార్కుల పట్ల సంతృప్తి చెందకపోతే పరిస్థితులు కుదుటపడ్డాక నిర్వహించే పరీక్షలకు హాజరుకావొచ్చని సీబీఎస్‌ఈ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని