Ap Special Status: ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై మరోసారి కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని తేల్చి చెప్పింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.
దిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఆర్థిక లోటు భర్తీకి 14వ ఆర్థిక సంఘం ఏపీకి నిధులు కేటాయించిందా? అని వైకాపా ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
‘‘14వ ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాలకు మధ్య తేడా లేకుండా పోయింది. అందుకే ప్రత్యేక హోదాకు బదులుగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాం. 2015 నుంచి 2018 వరకు ఈఏపీ పథకాలకు తీసుకున్న రుణాలపై వడ్డీని కూడా చెల్లించాం. అందుకోసం రూ.15.81 కోట్లు విడుదల చేశాం’’ అని నిత్యానందరాయ్ వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Mangalagiri: రెండేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి
-
Ap-top-news News
ISRO: అక్కడే చదివి.. శాస్త్రవేత్తగా ఎదిగి..ఎన్వీఎస్-01 ప్రాజెక్టు డైరెక్టర్ స్ఫూర్తిగాథ
-
India News
Women safety device: మహిళల రక్షణకు ఎలక్ట్రిక్ చెప్పులు
-
Ts-top-news News
Raghunandan: ఎమ్మెల్యే రఘునందన్‌పై రూ.1000 కోట్లకు పరువునష్టం దావా
-
Sports News
Dhoni: రిటైర్మెంట్పై నిర్ణయానికి ఇది సరైన సమయమే కానీ.. ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు