ఆనంద‌య్య మందుపై అభ్యంత‌ర‌మెందుకు?: చినజీయర్‌

నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య మందు వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేవంటున్నారు.. దీంతో పాటు ఔష‌ధాన్ని ఉచితంగా ఇస్తున్న‌ప్పుడు అభ్యంత‌రం ఎందుకు ...

Updated : 30 May 2021 16:54 IST

హైద‌రాబాద్‌: నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య మందు వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేవంటున్నారు.. దీంతో పాటు ఔష‌ధాన్ని ఉచితంగా ఇస్తున్న‌ప్పుడు అభ్యంత‌రం ఎందుకు అని చిన‌జీయ‌ర్ స్వామి ప్ర‌శ్నించారు. ఓ మందు ప్రాణాలు నిల‌బెడుతుంటే వివాదం ఎందుకు? అన్నారు. సంక్షోభం వేళ వివాదాల‌కు తావివ్వ‌కూడ‌దు అని చెప్పారు. ఎర్ర‌గ‌డ్డ‌లోని ఈఎస్ ఐ ఆస్ప‌త్రిని స్వామిజీ సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైద్య సిబ్బందితో మాట్లాడారు. 

ఒక వ్య‌క్తి చ‌నిపోతుంటే ఆనంద‌య్య మందు ప్రాణం నిల‌బెడుతున్న‌ప్పుడు ఎందుకు వివాదం అవుతోంద‌ని చిన‌జీయ‌ర్‌స్వామీ అన్నారు. అలోప‌తి వైద్యాన్ని వ్య‌వ‌స్థ అంగీక‌రించింద‌ని.. కానీ మంచిని ఎక్క‌డి నుంచైనా తీసుకోవ‌చ్చ‌ని ఆయ‌న వివ‌రించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని