CM Revanth: ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా పంట కొనుగోళ్లు: సీఎం రేవంత్‌రెడ్డి

ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు.

Updated : 21 Feb 2024 18:24 IST

కొడంగల్‌: ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో తొలిసారి ఆయన పర్యటించారు. కోస్గిలో రూ.4,369 కోట్ల విలువైన 20 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అందులో ప్రధానమైనది రూ.2,945 కోట్లతో నిర్మించనున్న నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం. అనంతరం మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి.. వారితో ముఖాముఖిలో పాల్గొన్నారు. అభివృద్ధిలో మహిళలను భాగస్వాములను చేస్తామని.. ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా పంటల కొనుగోళ్లు  చేపడతామని సీఎం తెలిపారు. కార్యక్రమంలో సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని