Published : 19 May 2022 03:39 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19-05-2022)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కలహ సూచన ఉంది కాబట్టి మాట విలువను కాపాడుకోవాలి.   ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. హనుమత్ ఆరాధన శుభప్రదం. 

మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్పలితాన్ని ఇస్తాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అష్టమ చంద్రస్థితి అనుకూలంగా లేదు. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. దుర్గా ఆరాధన మేలు చేస్తుంది.

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. రామ నామ జపం శ్రేయోదాయకం.

బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పారాయణ మంచిది.

చిత్తశుద్ధితో పనులను పూర్తిచేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం అవసరం. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయాన్ని వృథా కానీయకండి. ఆదిత్య హృదయం చదువుకోవాలి.

మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవరినీ విశ్వసించకండి. శ్రీరామ నామాన్ని జపించడం ఉత్తమం.

అదృష్ట కాలం. బుద్ధిబలంతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కలహాలకు తావివ్వరాదు. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

దైవబలం కలదు. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఒక వ్యవహారంలో నైతికవిజయం సాధిస్తారు. ఆర్ధికంగా మేలైన ఫలితాలు ఉన్నాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ ఆరాధన మరింత శుభాన్ని ఇస్తుంది.

ప్రారంభించిన పనులను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. దుర్గాస్తుతి  చదవాలి.

 

ప్రయత్న కార్యసిద్ధి కలదు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మాటపట్టింపులకు పోవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లక్ష్మీదేవి ఆరాధన శ్రేయోదాయకం.

ఉత్సాహంగా పనిచేసి ప్రారంభించిన పనులను పూర్తిచేస్తారు. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్ధిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. అనవసర ప్రయాణాల వల్ల సమయం వృథా అవుతుంది. బంధు,మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. కలహాలకు తావివ్వవద్దు. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది.

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలంతో ముందుకు సాగాలి. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. శివారాధన చేయాలి.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని