Updated : 26 Apr 2022 04:07 IST

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-04-2022)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మీకు శుభకాలం. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. సమయాన్ని మంచి పనులకు కేటాయించండి. అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

తోటివారి సహకారం ఉంటుంది. మీ ప్రతిభకు పెద్దలు నుంచి ప్రశంసలు లభిస్తాయి. శరీర సౌఖ్యం ఉంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

పట్టుదల వదలకండి. ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.

మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అష్టమ చంద్రదోష పరిహారార్ధం చంద్ర ధ్యానం శుభప్రదం.

ప్రయత్నకార్యానుకూలత ఉంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక వార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. ఈశ్వరారాధన సత్ఫలితాలను ఇస్తుంది.

విందు వినోదాలతో కాలం గడుస్తుంది. చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తిచేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మీలోని ఉత్సాహాన్ని పెంచుతాయి. ఇష్టదైవ ఆలయ సందర్శనం మరింత శుభాన్ని చేకూరుస్తుంది.

గ్రహబలం తక్కువగా ఉంది  మనోబలం ముందుకు నడిపిస్తుంది. గిట్టని వారితో మిత భాషణం అవసరం. సమయానికి నిద్రాహారాలు అవసరం. ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం

 చేపట్టిన పనులలో మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఆర్థిక విషయాలలో సమస్యలు తొలగి కుదురుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మాటను గౌరవిస్తే సమస్యలు తొలుగుతాయి. దుర్గ ఆరాధన శుభప్రదం.

 మొదలుపెట్టిన పనులలో విజయం సాధించగలుగుతారు. ఆర్థికంగా శుభకాలం. బంధుమిత్రులను కలిసి సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

 

చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం మంచిది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. దుర్గ  ధ్యానం శుభప్రదం.

శరీరసౌఖ్యం ఉంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. తోటివారితో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

ఆశించిన ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమించాల్సివస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన పురోగతి రావాలంటే బాగా కష్టపడాలి. నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని