Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/03/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. గొప్ప ఫలితాలను అందుకుంటారు. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.
మీ మీ రంగాల్లో విశేషమైన ఫలితాలను సాధిస్తారు. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. శ్రీఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
శుభకాలం నడుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. నూతన పద్ధతులను అవలంభించి లక్ష్యాన్ని సులువుగా చేరతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధు,మిత్రుల ఆదరణ ఉంటుంది. దైవారాధన మానవద్దు.
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి. శివారాధన శుభకరం.
అనుకూలమైన గ్రహబలం కలదు. ఏ పని తలపెట్టినా సకాలంలో పూర్తవుతుంది. సమాజంలో గొప్ప పేరు సంపాదిస్తారు. ఆస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే ఇంకా బాగుంటుంది.
లక్ష్యాన్ని చేరే క్రమంలో మనోబలం సర్వప్రధానం. కీలక వ్యవహారంలో తోటివారి ఆలోచనల వల్ల మంచి జరుగుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకు పరుస్తుంది. శ్రీలక్ష్మి దేవి సందర్శనం శుభప్రదం.
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించబోయే పనుల్లో చంచలత్వాన్ని రానీయకండి. ఉత్సాహంగా పనిచేయాలి. కీలక విషయాల్లో సున్నితంగా ముందుకు సాగాలి. అష్టమ చంద్రదోషం ఉంది. దుర్గాధ్యానం శుభప్రదం.
మీ మీ రంగాల్లో విజయం సాధిస్తారు. సంపూర్ణకార్యసిద్ధి ఉంది. సంపూర్ణ మనోబలం కలిగి ఉంటారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. అనుకూల ఫలితాలు ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల సహకారంతో మేలు జరుగుతుంది. మీ మీ రంగాల్లో ఒత్తిడిని దరిచేరనీయకండి. ముఖ్య వ్యవహారాలలో ఓర్పు చాలా అవసరం. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.
మిశ్రమ కాలం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TTD: జమ్మూకశ్మీర్లో జూన్ 8న శ్రీవారి ఆలయ సంప్రోక్షణ: తితిదే
-
Sports News
ICC: లాహోర్లో ఐసీసీ ఛైర్మన్.. ప్రపంచకప్లో పాక్ ఆడే అంశం ఓ కొలిక్కి వచ్చేనా..?
-
General News
Weather Update: తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
-
World News
China: భూగర్భంలోకి లోతైన రంధ్రం తవ్వుతున్న చైనా..!
-
India News
Education ministry: 10వ తరగతిలో.. 27.5లక్షల మంది ఫెయిల్..!
-
Crime News
Visakhapatnam: పెందుర్తిలో అర్ధరాత్రి రెచ్చిపోయిన రౌడీ మూకలు