కర్నూలు: ఆకట్టుకుంటున్న ‘డైన్‌ ఆన్‌ బస్‌’ థీం రెస్టారెంట్‌..

వ్యాపారంలో రాణించాలంటే విజన్ ఎంత అవసరమో.. వినూత్నంగా ఆలోచించడమూ అంతే అవసరం. అయితే ఒకొక్కరు ఒక్కో పంథాలో నడుస్తంటారు. కర్నూలుకు చెందిన శేఖర్‌, వినయ్‌, మరో స్నేహితుడు ముగ్గురు కలసి ఒక కొత్త ఆలోచనతో రెస్టారెంట్‌ ప్రారంభించారు.

Published : 26 Mar 2022 22:43 IST

కర్నూలు: వ్యాపారంలో రాణించాలంటే విజన్ ఎంత అవసరమో.. వినూత్నంగా ఆలోచించడమూ అంతే అవసరం. అయితే ఒకొక్కరు ఒక్కో పంథాలో నడుస్తంటారు. కర్నూలుకు చెందిన శేఖర్‌, వినయ్‌, మరో స్నేహితుడు ముగ్గురు కలసి ఒక కొత్త ఆలోచనతో రెస్టారెంట్‌ ప్రారంభించారు. చాలా వరకు హైదరాబాద్‌, బెంగుళూరు, ఇతర మెట్రోపాలిటిన్‌ నగరాల్లో  హోటల్స్‌లో చిన్న సైజు బొమ్మరైలు బోగీలపై భోజనం తీసుకురావడం ఎంతో మందిని ఆకట్టుకుంది. వ్యాపారం లాభసాటిగా మారింది. అలాగే మనమూ ఏదైనా కొత్త పద్దతిని పరిచయంచేద్దామనుకున్నారు. ఇందులో భాగమే.. సెకండ్ హ్యాండ్‌ సూపర్ లగ్జరీ బస్సు కొనుగోలు చేసి "డైన్ ఆన్ బస్" థీమ్ రెస్టారెంట్ ప్రారంభించారు. ఇప్పుడిది పట్టణవాసులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ బస్సు ఒక్క భోజనం చేసే రెస్టారెంట్‌ మాత్రమే కాదు. పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవాలు వంటి చిన్నచిన్న పార్టీలకు వేదికగా నిలుస్తోందంటున్నారు. వినియోగదారులు మాత్రం తెగ ఎంజాయ్‌చేస్తున్నామని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని