Disha Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసు.. చర్యలపై నిర్ణయం హైకోర్టుదే: సుప్రీంకోర్టు
దిల్లీ: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలంగాణ హైకోర్టు నిర్ణయిస్తుందని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రత్యేకంగా మానిటర్ చేయలేదని.. తదుపరి విచారణ, తీసుకునే చర్యలను హైకోర్టు నిర్ణయిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ వ్యవహారంపై సిర్పూర్కర్ కమిషన్ సవివర నివేదిక ఇచ్చి పలు సూచనలు చేసిందని తెలిపింది. చట్ట ప్రకారం ఏం చేయాలో హైకోర్టు నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
‘‘హైకోర్టు, కింది స్థాయి కోర్టులో ఏం జరుగుతుందో తెలియదు. మేం నివేదిక పంపుతాం.. దీనిపై హైకోర్టే నిర్ణయం తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యవహారమిది. నివేదిక చూడకుండా కేసులో వాదనలు వినడం.. కేసును సుప్రీంకోర్టు నేరుగా పరిశీలించడం సాధ్యంకాదు. తెలంగాణ న్యాయవాదులు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి రావాలి’’ ధర్మాసనం సూచించింది. మరోవైపు ఈ విచారణకు నిందితుల ఎన్కౌంటర్ జరిగిన సమయంలో సైబరాబాద్ సీపీగా వ్యవహరించిన వీసీ సజ్జనార్ హాజరయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
-
India News
PM Modi: అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్ నిలిచి గెలిచింది: ప్రధాని మోదీ
-
Ts-top-news News
TSRTC: 75 ఏళ్లు దాటిన వారికి నేడు ఉచిత ప్రయాణం
-
Crime News
Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
- Sushil Modi: ప్రధాని రేసులో నీతీశే కాదు.. మమత, కేసీఆర్ వంటి నేతలూ ఉన్నారు..!
- Rakesh Jhunjhunwala: దిగ్గజ ఇన్వెస్టర్.. ఝున్‌ఝున్‌వాలా చెప్పిన విజయసూత్రాలివే!