తెలంగాణలో అందరికీ ఉచిత వ్యాక్సిన్‌: కేసీఆర్‌

తెలంగాణ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్‌ అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కీలక నిర్ణయం

Updated : 24 Apr 2021 17:17 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్‌ అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. రాష్ట్రంలో నానాటికీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. వ్యాక్సినేషన్‌ కోసం ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ను తాను స్వయంగా పర్యవేక్షిస్తానని, రెండు, మూడు రోజుల్లో వైద్య పరీక్షల తర్వాత అధికారులతో సమీక్ష జరపనున్నట్లు వివరించారు. ఆక్సిజన్‌, రెమ్‌డెసివర్‌ కొరత రాకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వ్యాక్సినేషన్‌ కోసం దాదాపు రూ.2500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు వివరించిన కేసీఆర్‌, ప్రజల ఆరోగ్యం కంటే డబ్బు ముఖ్యం కాదని పునరుద్ఘాటించారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు