Amaravati: అమరావతిలో మళ్లీ అలజడి.. ఆర్ 5జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ
రాజధాని అమరావతిలో ఆర్ 5 జోన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్ జారీ చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసేందుకు మరోసారి రాజధాని రైతులు సిద్ధమయ్యారు.
అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో మరోసారి అలజడి మొదలైంది. రైతుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా రాజధానిలో ఆర్ 5 జోన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో దాదాపు 900 ఎకరాలను ఆర్-5 జోన్ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆర్-5 జోన్ ఏర్పాటుపై 2022 అక్టోబరులోనే ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయం సరికాదని, జీవోను వ్యతిరేకిస్తూ అప్పట్లో రాజధాని రైతులు కోర్టుకు వెళ్లారు. కనీసం రైతుల అభిప్రాయాలు తీసుకోలేదని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో అధికారులు రాజధాని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మూకుమ్మడిగా రాజధాని రైతులు వ్యతిరేకించారు. అయినా, రైతుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం ఆర్-5 జోన్ ఏర్పాటుపై గెజిట్ విడుదల చేసింది. పేద వర్గాల ఇళ్ల కోసం భూములు కేటాయిస్తున్నట్టు గెజిట్‌లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి కోర్టులో సవాలు చేసేందుకు రాజధాని రైతులు సిద్ధమయ్యారు.
ఏమిటీ ఆర్5 జోన్?
రాజధాని బృహత్ ప్రణాళిక ప్రకారం ఇప్పటి వరకు 4 నివాస జోన్లు ఉండేవి. మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధానిలో ఇంతవరకు ఆర్-1 (ప్రస్తుత గ్రామాలు), ఆర్-2 (తక్కువ సాంద్రత గృహాలు), ఆర్-3 (తక్కువ నుంచి మధ్యస్థాయి సాంద్రత కలిగిన గృహాలు), ఆర్-4 (హైడెన్సిటీ జోన్) పేర్లతో 4 రకాల నివాస జోన్లు ఉండేవి. అయితే, రాజధానిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులోని 900.97 ఎకరాలను ఆర్-5 జోన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కేసు అంతులేని కథ: గోరంట్ల
-
Sports News
CSK vs GT: ‘ఫైనల్’ ఓవర్లో హార్దిక్ అలా ఎందుకు చేశాడో..?: సునీల్ గావస్కర్
-
World News
Donald Trump: నేను మళ్లీ అధికారంలోకి వస్తే.. ఆ హక్కు ఉండదు: ట్రంప్
-
Politics News
MLC Kavitha: బ్రిజ్ భూషణ్‌పై చర్యలేవీ?: కేంద్రాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత
-
India News
Brij Bhushan Singh: బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఆధారాలు లభించలేదు..!
-
Politics News
BJP: ‘మోదీ.. ది బాస్’ అంటే రాహుల్ జీర్ణించుకోవట్లేదు: భాజపా కౌంటర్