మంత్రి మల్లారెడ్డి ‘ఆడియో’ వివాదం

టికెట్ల కేటాయింపులో మంత్రి మల్లారెడ్డి వ్యవహరించిన తీరుపై స్థానిక నాయకుడు ఒకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆడియో సాంఘిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. బోడుప్పల్‌ కాలనీ

Published : 17 Jan 2020 06:52 IST

టికెట్ల కేటాయింపులో మంత్రి మల్లారెడ్డి వ్యవహరించిన తీరుపై స్థానిక నాయకుడు ఒకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆడియో సాంఘిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. బోడుప్పల్‌ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు రాపోలు రాములుతో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ వెలుగుచూసింది. టికెట్ల కేటాయింపు విషయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం నడిచింది. తనకు కాకుండా వేరొకరికి సీటిచ్చేశారని, మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేసి టికెట్‌ కోసం ప్రయత్నిస్తానని రాములు చెప్పారు. తన నుంచి డబ్బు అడిగిన విషయంపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తానని చెప్పినట్లు ఆడియోలో ఉంది. తనతో పాటు పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇవ్వలేదని రాపోలు చెప్పగా.. 15 రోజుల కిందట చేరిన వారికి ఎలా ఇస్తామంటూ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. అనంతరం ఈ ఆడియో వ్యవహారంపై మంత్రి మీడియాకు వివరిస్తూ ఆ ఆడియోలో తానేమీ తప్పుగా మాట్లాడలేదన్నారు. డబ్బూ డిమాండ్‌ చేయలేదన్నారు. టికెట్‌ ఇస్తామన్నా అతను (రాములు) వద్దన్నాడని చెప్పారు.

- ఈనాడు, హైదరాబాద్‌
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని