ఉపరాష్ట్రపతిని కలిసిన అమరావతి రైతులు

అమరావతి రైతులు, ఐకాస నేతలు మంగళవారం ఉదయం దిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి రాజధాని సమస్యలు వివరించారు. రాజధానిలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతులు, మహిళలు, నిరసనకారులపై పోలీసుల దాడులను

Updated : 04 Feb 2020 12:01 IST

దిల్లీ: అమరావతి రైతులు, ఐకాస నేతలు మంగళవారం ఉదయం దిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి రాజధాని సమస్యలు వివరించారు. రాజధానిలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతులు, మహిళలు, నిరసనకారులపై పోలీసుల దాడులను వివరించారు. రైతులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని తరలించకుండా చూడాలని, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

‘‘రాష్ట్రపతిని కూడా సమయం కోరాం, అపాయింట్‌మెంట్‌ రాగానే వెళ్లి అమరావతి అంశాన్ని వివరిస్తాం. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌ సహా భాజపా పెద్దలు, ప్రతిపక్ష నేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, సీతారాం ఏచూరిని కూడా కలిసి అమరావతిని సమస్యను వివరిస్తాం’’ అని రైతులు తెలిపారు. రాజధాని రైతులతోపాటు ఎంపీలు గల్లా జయదేవ్‌, సీతారామలక్ష్మి తదితరులు ఉపరాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని