కరోనా వ్యాప్తి నివారణలో రోబోల వాడకం

కరోనా వ్యాధిగ్రస్థులకు చికిత్స చేస్తూ వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వైద్యుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణ, రోగుల ఉపశమనానికి చైనా ప్రభుత్వం పరిష్కార మార్గాన్ని కనుగొంది. కరోనా రోగులకు ఆహారం, ఔషధాల సరఫరా తదితర అవసరాలకు ఆసుపత్రుల్లో రోబోల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది

Updated : 12 Feb 2020 04:41 IST

బీజింగ్‌: కరోనా వ్యాధిగ్రస్థులకు చికిత్స చేస్తూ వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వైద్యుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణ, రోగుల ఉపశమనానికి చైనా ప్రభుత్వం పరిష్కార మార్గాన్ని కనుగొంది. కరోనా రోగులకు ఆహారం, ఔషధాల సరఫరా తదితర అవసరాలకు ఆసుపత్రుల్లో రోబోల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. చైనాలోని ఓ ఆసుపత్రిలో కరోనా రోగులకు ఆహారం, ఔషధాలను ఓ రోబో అందజేస్తున్నట్లు ఉన్న ఒక వీడియోను చైనా పత్రిక ‘పీపుల్స్‌ డైలీ’ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. 360 డిగ్రీల కోణంలో ఎటువైపు అయినా కదలగల సామర్థ్యం ఉన్న ఈ రోబో, ఆసుపత్రుల్ని పూర్తిగా శుభ్రం చేసి ఇన్ఫెక్షన్లు సోకకుండా చేయగలదు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని