కరోనా ఎఫెక్ట్‌ : యూట్యూబ్‌ కీలక నిర్ణయం

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటిస్తున్నాయి. కొన్ని రోజుల పాటు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ఒక వేళ అత్యవసరమై

Published : 31 Mar 2020 01:42 IST

యూట్యూబ్‌లో ఆ క్వాలిటీ వీడియోలు చూడలేరు

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటిస్తున్నాయి. కొన్ని రోజుల పాటు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ఒక వేళ అత్యవసరమై బయటకు వెళ్తే సామాజిక దూరం పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చని వివరిస్తున్నారు. దీంతో ప్రజలందరూ దాదాపు ఇళ్లలోనే ఉంటున్నారు. పాఠశాలలు, కాలేజీలు, ఆఫీస్‌లకు సెలవులు ప్రకటించడంతో ఎవరూ ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఇళ్లలో ఉండే వారికి ప్రధాన వినోద సాధనం టెలివిజన్‌ లేదా మొబైల్‌. గత కొద్దిరోజులుగా భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో యూట్యూబ్‌తో పాటు అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంల వేదికపై సినిమాలు, వినోద కార్యక్రమాలు చూసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 

ముఖ్యంగా మొబైల్‌లో యూట్యూబ్‌ చూసేవారి సంఖ్య పెరగడంతో బ్యాండ్‌ విడ్త్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో యూట్యూబ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్‌ ఫ్లాట్‌ఫాం వేదికగా అన్ని వీడియోల క్వాలిటీని 480పి తగ్గించింది. అయితే, డెస్క్‌టాప్‌ వెర్షల్‌లో మాత్రం ఎలాంటి నిబంధనా విధించలేదు. ఎప్పటిలాగే మనకు కావాల్సిన క్వాలిటీలో వీడియోను చూడవచ్చు. ఇక ఇదే బాటలో నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌లు కూడా పయనించనున్నాయి. అంతర్జాల వినియోగాన్ని తగ్గించే క్రమంలో ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ సంస్థలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి.

 ‘మేము ప్రభుత్వం, నెట్‌వర్క్‌ ఆపరేటర్లతో కలిసి ముందుకు వెళ్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో మావంతు కృషి చేస్తున్నాం. గత వారం ఈయూలో యూట్యూబ్‌ వీడియోనలు ఎస్‌డీ క్వాలిటీకి పరిమితం చేశాం. ఈరోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా వీడియో క్వాలిటీని 480పి క్వాలిటీకి తగ్గించాం’ అని యూట్యూబ్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని