వైద్యారోగ్యశాఖ, పోలీసులకు పూర్తి జీతం

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వ్యాప్తి తీవ్రప్రభావం చూపుతోందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనాలన్నింటిలో కోత విధిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే

Updated : 24 Sep 2022 15:23 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వ్యాప్తి తీవ్రప్రభావం చూపుతోందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనాలన్నింటిలో కోత విధిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వేతనాల కోత నుంచి వైద్యరోగ్యశాఖ, పోలీసులకు మినహాయింపు ఇస్తూ  మార్చి నెలకు సంబంధించి వీరికి పూర్తి జీతం ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ఈ సమీక్ష సుదీర్ఘంగా సాగుతోంది. ఈ సమీక్షలో వైద్యారోగ్య సిబ్బంది, పోలీసులకు నగదు ప్రోత్రాహకాలు ఇచ్చేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇన్సెంటివ్స్‌ను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమీక్షలో మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆర్థిక కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని