పీఎం కేర్స్‌కు తెలంగాణ గవర్నర్‌ విరాళం

కరోనాపై పోరాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తన వంతు సహకారం అందించారు. కొవిడ్‌పై పోరులో జాతికి అండగా

Updated : 06 Apr 2020 13:58 IST

హైదరాబాద్‌: కరోనాపై పోరాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తన వంతు సహకారం అందించారు. కొవిడ్‌పై పోరులో జాతికి అండగా నిలవాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు పీఎం కేర్స్‌ సహాయ నిధికి తన వంతు సాయంగా రూ.5లక్షలు విరాళం అందించారు. సంబంధిత చెక్కును రాజ్‌భవన్‌ నుంచి కేంద్రానికి పంపించారు. 

అదేవిధంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా ఇప్పటికే గవర్నర్‌ తన ఒక నెల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించి రూ.3.50 లక్షల చెక్కును రాష్ట్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. జగదీశ్వర్‌కు ఇటీవల అందజేసిన విషయం తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని