మాస్కులు తయారుచేసి చూపించిన స్మృతి ఇరానీ

నాలుగు గోడలకు పరిమితమై లాక్‌డౌన్‌ సమయాన్ని ఎలా గడపటం అనేది ఇప్పుడు అనేకమందిని వేధిస్తున్న ప్రశ్న. 

Published : 10 Apr 2020 14:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని.. బయటకి వస్తే మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇంట్లోనే మాస్కులను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తూ ఓ పోస్టు పెట్టారు. 

మాస్కులకు కొరత ఉన్న ప్రస్తుత తరుణంలో తిరిగి ఉపయోగించే మాస్కులను వాడటమే చక్కని ఉపాయమని ఆమె పేర్కొన్నారు. వాటిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలో మంత్రి చేసి చూపించారు. శుభ్రమైన వస్త్రం, సూది, దారం సహాయంతో... చేతితోనే మాస్కు తయారీని చిత్రాల ద్వారా చక్కగా అర్థమయ్యేలా వివరించారు. తన పోస్టుకు ‘మాస్క్‌ఇండియా’ అనే హాష్‌టాగ్‌ను కూడా జతచేశారు. స్మృతి ఐడియా నెటిజన్లకు నచ్చేయటంతో కొద్ది గంటల్లోనే 50వేల లైక్‌లు వచ్చాయి. ‘ఇది గొప్ప ఐడియా మేడం’ అంటూ వేలాదిమంది ప్రశంసించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని