- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
కేంద్రమంత్రికి కుమారుడు ట్రిమ్మింగ్
వీడియో పంచుకున్న చిరాగ్ పాసవాన్
న్యూదిల్లీ: లాక్‌డౌన్ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్న కేంద్ర మంత్రి, బిహార్ నేత రాంవిలాస్ పాసవాన్ గడ్డం పెరిగిపోయింది. మరోవైపు క్షవరశాల(హేర్ సెలూన్)లు మూతబడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుమారుడు చిరాగ్ పాసవాన్ ముందుకొచ్చి ట్రిమ్మర్‌తో గడ్డాన్ని ట్రిమ్ చేశారు. ఆదివారం ఈ వీడియోను చిరాగ్ ట్వీటర్‌లో పంచుకున్నారు. ‘నాకు ఈ నైపుణ్యం కూడా ఉందని ఇప్పటివరకు తెలియదు. ఇది కష్టకాలమే.. అయినా కరోనాపై పోరాడదాం. అలాగే మంచి జ్ఞాపకాలను సృష్టించుకుందాం’ అని వీడియోకు వ్యాఖ్యను చేర్చారు. దీనిపై నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇది అపురూపం. ఓ కుమారుడు తన తండ్రికి ట్రిమ్ చేస్తున్నాడు’ అని ఓ వ్యక్తి స్పందించారు. ‘నీలాంటి కుమారుడు ఉన్నందుకు మీ తండ్రి సంతోషంగా ఉండాలి’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Biden: దగ్గిన చేతితోనే పెన్ను ఇచ్చి, కరచాలనం చేసి..!
-
Sports News
FIFA: ఫుట్‌బాల్ సమాఖ్యపై నిషేధం.. తాష్కెంట్లో చిక్కుకుపోయిన 23సభ్యుల మహిళల బృందం
-
Crime News
Crime news: ‘టీ’లో విషం కలిపి ముగ్గురు పిల్లలను హత్యచేసిన తల్లి
-
General News
Health tips: ఆరు రుచులతో ఆరోగ్యం.. ఈ విశేషాలు మీకు తెలుసా?
-
Politics News
Bihar: అరెస్టు వారెంటున్న నేత.. న్యాయశాఖ మంత్రిగా ప్రమాణం..!
-
Sports News
DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Bihar: అరెస్టు వారెంటున్న నేత.. న్యాయశాఖ మంత్రిగా ప్రమాణం..!
- Tollywood: విజయేంద్రప్రసాద్ కథతో భారీ బడ్జెట్ మూవీ.. దర్శకుడు ఎవరంటే?
- Shyam Singha Roy: ఆస్కార్ నామినేషన్ల పరిశీలన రేసులో ‘శ్యామ్ సింగరాయ్’
- Heart Health: చేపలతో గుండెకెంత మేలో తెలుసా..?
- Crime news: ‘టీ’లో విషం కలిపి ముగ్గురు పిల్లలను హత్యచేసిన తల్లి
- Chandrababu: ఎన్నికలకు సమయం లేదు.. దూకుడు పెంచాలి: చంద్రబాబు
- Health tips: ఆరు రుచులతో ఆరోగ్యం.. ఈ విశేషాలు మీకు తెలుసా?
- స్తంభనలోపాన్ని కట్టేయండి