పెళ్లికి వెళ్లి ఇరుక్కుపోయిన వరంగల్‌ వాసులు

రాష్ట్రాలు దాటి పెళ్లికి వెళ్లి కష్టాలు కొనితెచ్చుకున్నారు వరంగల్‌ వాసులు.. ఒకే గదిలో నెల రోజులుగా ఉంటూ అవస్థలు పడుతున్నారు.. వరంగల్‌ గ్రామీణ జిల్లా సంధ్య మండలం గవచెర్ల, షాపూర్‌, రామచంద్రాపురం, బొల్లికుంట్ల, అనంతరం గ్రామాలకు... 

Published : 29 Apr 2020 00:38 IST

సూరత్‌లో ఇరుక్కుపోయిన వరంగల్‌ వాసులు 

వరంగల్‌: రాష్ట్రాలు దాటి పెళ్లికి వెళ్లి కష్టాలు కొనితెచ్చుకున్నారు వరంగల్‌ వాసులు. ఒకే గదిలో నెల రోజులుగా ఉంటూ అవస్థలు పడుతున్నారు. వరంగల్‌ గ్రామీణ జిల్లా  గవచెర్ల, షాపూర్‌, రామచంద్రాపురం, బొల్లికుంట్ల గ్రామాలకు చెందిన 40 మంది గత నెల 20న బంధువుల పెళ్లి కోసం సూరత్‌కు వెళ్లారు. వీరిలో 15 మంది మరుసటి రోజే వచ్చినా మిగిలిన 25 మంది అక్కడే ఉండిపోయారు. అనంతరం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో తిరిగి రాలేని పరిస్థితి. ఒక చిన్న గదిని అద్దెకు తీసుకోగా స్థలం సరిపోకపోవడంతో వంతుల వారీగా నిద్ర పోతున్నారు. బియ్యం, కూరగాయలు లేకపోవడంతో రోజూవారి జీవనాన్ని సాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలాగైనా స్వగ్రామానికి పంపించాలని, ఇక్కడికి వచ్చాక క్వారంటైన్‌లో ఉండేందుకైనా సిద్ధమేనని వారు చెబుతున్నారు. 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని