ట్రాఫిక్‌ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌: కేటీఆర్‌

హైదరాబాద్‌లో రహదారుల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. హైదరాబాద్‌ రహదారుల అభివృద్ధి సంస్థ పనుల పురోగతిపై కేటీఆర్‌ సమీక్షించారు. నెల రోజుల పాటు రహదారుల

Updated : 02 May 2020 15:25 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో రహదారుల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. హైదరాబాద్‌ రహదారుల అభివృద్ధి సంస్థ పనుల పురోగతిపై కేటీఆర్‌ సమీక్షించారు. నెల రోజుల పాటు రహదారుల పనుల్లో నిమగ్నం కావాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌ను మార్చడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు లభించిందని చెప్పారు.

లింక్‌ రోడ్లలో ఆటంకంగా మారిన భూసేకరణపై శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. హైవేలను అనుసంధానించే లింక్ రోడ్లు 120 అడుగులు ఉండాలన్నారు. భవిష్యత్‌ అవసరాలు, ట్రాఫిక్‌ రద్దీ అంచనా వేసి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. రైల్వే అండర్‌ పాస్‌, ఓవర్‌ బ్రిడ్జిలకు భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణలో భాగంగా నిర్వాసితులయ్యే పేదలు, కూలీలు పట్ల మానవీయత చూపించాలని.. వారికి ప్రభుత్వపరంగా పునరావాసం కల్పించాలని అధికారులకు కేటీఆర్‌ ఆదేశించారు.

ఎస్ఆర్డీపీ, లింక్, సర్వీస్ రోడ్లను మరింత ప్రయోజనకరంగా పొడిగించేందుకు హెచ్ఎండీఏ, ఇతర విభాగాలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్‌ను అప్‌డేట్‌ చేయనున్నట్లు కేటీఆర్‌ వివరించారు. నిర్మాణంలో ఉన్న  రైల్వే అండర్ పాస్‌లు, రైల్వే ఓవర్ బ్రిడ్జి లతో పాటు కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు, భూసేకరణకు నిధుల కొరత లేదని కేటీఆర్ వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని