ఖైరతాబాద్‌ గణేశుడి ఎత్తు ఒక్క అడుగే!

ఖైరతాబాద్‌ మహాగణపతి.. ఈ భారీ వినాయకుడికి హైదరాబాద్‌ నగరంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. విగ్రహం ఎత్తు, రూపంలోనే కాకుండా.. ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకూ భారీ సంఖ్యలో భక్తుల కోలాహలంతో ఇక్కడ ప్రతి రోజూ

Published : 13 May 2020 01:52 IST

ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం


 

హైదరాబాద్‌ : ఖైరతాబాద్‌ మహాగణపతి.. ఈ భారీ వినాయకుడికి హైదరాబాద్‌ నగరంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. విగ్రహం ఎత్తు, రూపంలోనే కాకుండా.. ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకూ భారీ సంఖ్యలో భక్తుల కోలాహలంతో ఇక్కడ ప్రతి రోజూ ఎంతో సందడిగా ఉంటుంది. అయితే హైదరాబాద్‌ నగరంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో గణేశ్‌ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది భారీ వినాయకుడిని ప్రతిష్ఠించే నిర్వాహకులు.. ఈసారి మాత్రం కేవలం ఒక్క అడుగు ఎత్తు ఉండే గణేశుడి ప్రతిమను ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. కొవిడ్‌ నేపథ్యంలో భారీ విగ్రహ ఏర్పాటును ఈ సారి కమిటీ విరమించుకుంది. ఈ మేరకు ఈ నెల 18న నిర్వహించాల్సిన కర్ర పూజ కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

గత కొన్నేళ్లుగా ఖైరతాబాద్‌ మహా వినాయకుడి విగ్రహం ఎత్తును ఏడాదికి ఒక్కో అడుగు చొప్పున తగ్గిస్తూ వస్తున్నారు. గత ఏడాది 65 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే ఈసారి మాత్రం ఒక్క అడుగు విగ్రహమే భక్తులను కనువిందు చేయనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని