ఏపీ నిర్ణయంతో తెలంగాణకు నష్టం:రజత్‌కుమార్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణకు పూడ్చలేని నష్టం జరుగుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌ తెలిపారు. ఇదే విషయాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన

Updated : 13 May 2020 20:28 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణకు పూడ్చలేని నష్టం జరుగుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌ తెలిపారు. ఇదే విషయాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేశామన్నారు. గతంలోనే ఈ విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన గుర్తు చేశారు. నీటి పర్యవేక్షణకు ఎలాంటి విధానం లేదని, ఎన్నిసార్లు చెప్పినా పోతిరెడ్డిపాడు వద్ద టెలీమెట్రి ఏర్పాటు చేయడంలేదని రజత్‌ కుమార్‌ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు 512టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేవలం తాత్కాలిక కేటాయింపులు మాత్రమేనన్నారు. కృష్ణా జలాల కేటాయింపు విషయమై ఇప్పటికే ట్రైబ్యునల్‌లో కేసు వేసినట్లు ఆయన తెలిపారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉన్నందున 575 టీఎంసీల నీరు ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. కొత్త ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోకుండా చూడాలని కృష్ణా బోర్డు ఛైర్మన్‌ను కోరినట్లు ఆయన వివరించారు.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని