TS: జూన్‌ 3న ఇంటర్‌ పరీక్షలు

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో రాష్ట్రంలో వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు..........

Published : 13 May 2020 20:02 IST

హైదరాబాద్: కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో రాష్ట్రంలో వాయిదా పడిన ఇంటర్‌ పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు సిద్ధమయ్యింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను ప్రకటించింది. జూన్‌ 3న ఇంటర్‌ రెండో సంవత్సరం జాగ్రఫీ, మోడరన్‌ లాంగ్వేజ్‌ పరీక్షలు జరుగుతాయని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్ ఓ ప్రకటనలో తెలిపారు. పాత హాల్‌టికెట్ల నంబర్లతో గతంలో కేటాయించిన కేంద్రాల్లోనే పరీక్షలు జరుగుతాయని తెలిపారు. 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వాస్తవంగా మార్చి 23న జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఈ రెండు పరీక్షలు వాయిదా పడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని